Teacher: క్లాస్ చెప్తుండ‌గా టీచ‌ర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థి

ఓ టీచ‌ర్ (teacher) క్లాస్ చెప్తుండ‌గా.. ఓ విద్యార్థి ఉన్న‌ట్టుండి లేచి చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న వైర‌ల్ అవుతోంది. ఫిజిక్స్ వాల్లా అనే ఎకాడ‌మీ యాప్ ద్వారా లైవ్ క్లాసులు చెప్తున్న ఓ టీచ‌ర్‌పై విద్యార్థి చెప్పుతో దాడి చేసాడు. ఏం జ‌రిగిందో ఎందుకు దాడి చేసాడో తెలీదు కానీ ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చ‌దువు చెప్పే గురువునే విద్యార్థులు ఇలా చెప్పుల‌తో కొడుతుంటే ఈ స‌మాజం ఎటుపోతోందో ఏమో..!