Loan Apps: లోన్ యాప్ వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి
Loan Apps: లోన్ యాప్ వేధింపులకు ఓ డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బలైపోయాడు. ఈ ఘటన పల్నాడులో చోటుచేసుకుంది. ఈపూరు మండలం గుంటతండాకి చెందిన బాలస్వామి అనే విద్యార్ధి డిగ్రీ చదువుతున్నాడు. ఏడాది కిందట ఓ లోన్ యాప్‌లో కొంత రుణం తీసుకుని ఆ తర్వాత దానిని చెల్లించలేకపోయాడు. కొన్నాళ్లుగా ఫోన్లో వేధిస్తున్న యాప్ ప్రతినిధులు, నేరుగా ఇంటికి వచ్చి బెదిరించడంతో ఏం చేయాలో తెలీక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ: Students Commits Suicide: ఉరేసుకున్న టెన్త్ విద్యార్థినులు
లోన్ యాప్స్‌తో జాగ్రత్త..!
ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో ఎన్నో లోన్ యాప్స్ ఉన్నాయి. తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో అప్పు ఇస్తామని ఊరిస్తారు. దాంతో ఇలాంటి లోన్ యాప్స్ వాడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కోకొల్లలు. తీసుకున్న లోన్ కట్టేసిన తర్వాత కూడా అసలు ఏమీ చెల్లించలేదని మోసాలకు పాల్పడే వారు ఎక్కువైపోయారు. లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసి వ్యక్తిగత సమాచారం సేకరించే సమయంలోనే వాట్సాప్, కాంటాక్ట్స్ యాక్సెస్ కూడా తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకున్న లోన్ కట్టకపోతే రేప్ చేసావని వాట్సాప్‌లో అందరికీ పంపిస్తామని.. మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడతామని బెదిరింపులకు పాల్పడుతుంటారు. కాబట్టి అసలు ఈ లోన్ యాప్స్ జోలికి పోకపోవడమే మంచిది.