రేయ్ పవన్… చెత్తనా కొడకా.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి
Sri Reddy: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వైజాగ్ బీచ్లో నగ్నంగా తిరుగుతానని శపథం చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అధికారిక వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తగా కాకపోయినా.. ఎప్పటినుంచో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే అని చెప్తూ వచ్చింది. జగన్కు, పార్టీకి సంబంధించిన అన్ని విషయాలపై పట్టు ఉన్నట్లు లైవ్ వీడియోల్లో తెగ మాట్లాడేసేది.
అలాంటి తనను జగన్ ఒక్కసారి కూడా విజయవాడకు పిలిపించి మాకు మద్దతు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పిన పాపాన పోలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ పిలిచి మాట్లాడినా మాట్లాడకపోయినా తాన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని.. ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా కార్యకర్తగానే వెళ్తానని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కొడాలి నాని, పేర్ని నానిల ఇళ్లపై తెలుగు దేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని.. మరి ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ ఇప్పుడెందుకు బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టిన చెత్తనా కొడుకని.. ఈరోజు బయటికి వచ్చి అదే అమాయక ప్రజలపై దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడని నోరుపారేసుకుంది.