Sirish Bharadwaj: శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి
Sirish Bharadwaj: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీజ్ భరద్వాజ్ కన్నుమూసాడు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్.. ఈరోజు ఉదయం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2007లో శ్రీజ శిరీష్‌లు ప్రేమించుకుంటున్నామంటూ ఇంట్లో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఒకే కాలేజ్‌లో చదువుకుంటూ ప్రేమించుకున్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత శిరీష్.. అతని తల్లిదండ్రులు కట్నం కోసం టార్చర్ పెడుతున్నారంటూ శ్రీజ మళ్లీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శిరీష్ కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.