Viral News: తమ్ముడి తప్పుడు నిర్ణయం.. అక్క జీవితం నాశనం
Viral News: ముందూ వెనక ఆలోచించకుండా ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అతని అక్క జీవితాన్ని నాశనం చేసింది. అసలేం జరిగిందంటే.. పంజాబ్‌లోని లుధియానా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మహిళ సోదరుడికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఆ అబ్బాయి ప్రేమించాడు.
ఇంట్లో వారు ఒప్పుకోరేమో అనే భయంతో ఇద్దరూ మే 1న లేచిపోయారు. సరిగ్గా అదే రోజు యువతి తండ్రి, బంధువులు యువకుడి ఇంటికి వెళ్లి వారి కోసం వెతికారు. ఆ యువకుడి సోదరిపై చేయి చేసుకున్నారు. తనకేమీ తెలీదని ఎంత చెప్తున్నా వినకుండా ఆమె పై నలుగురూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా రేప్ చేస్తున్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసారు. వెళ్లిపోయేముందు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు.
ఆ ఘటన తర్వాత యువతి దాదాపు రెండు నెలల పాటు షాక్‌లోనే ఉంది. తన భర్తకు కూడా ఏమీ చెప్పుకోలేకపోయింది. ఇప్పుడు ఆ యువతి కాస్త కోలుకోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.