Viral News: ఆక‌తాయి వేధింపులు.. అన్న‌కు రాఖీ క‌ట్టి చ‌నిపోయిన యువ‌తి

sister dies after tying rakhi to brother

Viral News:  ఓ ఆక‌తాయి వేధింపుల‌ను భ‌రించ‌లేక ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కొన ఊపిరితో ఉండ‌గానే తాను బ‌తికి ఉంటానో లేదో అని ముందురోజే అన్న‌కు రాఖీ క‌ట్టి త‌నువు చాలించింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్‌లో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న యువ‌తి(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను వెంట‌నే ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.