Singapore: సింగ‌పూర్‌లో ఈ 16 ర‌కాల పురుగుల‌ను వండుకుంటార‌ట‌

singapore residents eats these 15 type of insects

Singapore: దాదాపు 16 ర‌కాల పురుగుల‌ను ఆహారంగా మార్చుకోవ‌చ్చ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంటే.. సింగ‌పూర్ వాసులు 16 ర‌కాల పురుగుల‌ను వండుకుని తిన‌చ్చ‌న్న‌మాట‌. అయితే రైతులు.. దిగుమ‌తిదారులు సింగ‌పూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) నిబంధ‌న‌ల‌ను ఫాలో అవ్వాల్సిందే. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పురుగుల పెంప‌కాన్ని చేప‌ట్టాలి. అంతేకానీ అడ‌వుల నుంచి తీసుకొచ్చి వాటిని అమ్మ‌కాల‌కు పెడితే నేరుగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.

సింగ‌పూర్‌లో ఎక్కువగా క్రికెట్స్, మిడ‌త‌లు, గొల్ల‌భామ‌లు, ప‌ట్టుపురుగుల‌ను తింటారు. దాంతో అక్క‌డి రెస్టారెంట్ల‌లో వీటితో త‌యారుచేసే వంట‌కాలు 30 రెట్లు అధికం అయ్యాయి. ఇక సింగ‌పూర్‌కి వ‌చ్చే పురుగుల ప్యాకెట్లు ఎక్కువ‌గా చైనా, జ‌పాన్, వియ‌త్నాం నుంచి వ‌స్తాయి. అయితే ఇలా పురుగులు ఎందుకు తింటున్నారంటే.. మాంసాహారాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇవి తింటే మంచిది అని యునైటెడ్ నేష‌న్స్ ఫుడ్ అండ్ ఆగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేషన్ (UNFAO) సంస్థ వెల్ల‌డించింది.