షాకింగ్.. ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో పురుగుల మందు వినియోగం
Everest: ప్రముఖ స్పైసెస్ బ్రాండ్ ఎవరెస్ట్ మసాలా ప్యాకెట్లలో పురుగుల మందులు వాడుతున్నారట. హాంకాంగ్‌కి చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ సంస్థ ఆరోపణలు చేసింది. ఈ మసాలా ప్యాకెట్లలో ఎథిలీన్ ఆక్సైడ్ వాడుతున్నారని తెలిపింది. దాంతో వెంటనే అప్రమత్తమైన సింగపూర్ తమ మార్కెట్లలో ఉన్న ఎవరెస్ట్ ప్యాకెట్లను రీకాల్ చేసింది.
ఈ నేపథ్యంలో సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వారు ఇండియా నుంచి తమకు ఎగుమతి చేస్తున్న ఎస్పీ ముత్తయ్య & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు జారీ చేసారు. ఇప్పటివరకు ఎగుమతి చేసిన ఎవరెస్ట్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేసుకుని పరీక్షలు చేయించాలని ఆదేశించారు. అందులోనూ ఎవరెస్ట్ ఫిష్ మసాలా కర్రీలోనే ఈ ఎథిలీన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉందని సింగపూర్ సంస్థ ఆరోపించింది. ఎథిలీన్ ఆక్సైడ్‌ను పొలాలకు ఎక్కువగా వాడుతుంటారు. దీనిని వాడొద్దని కేంద్రం ఆల్రెడీ హెచ్చరిక కూడా జారీ చేసింది.
ALSO READ:
Viral News: క్లాస్ ఎగ్గొట్టి స్కూల్లో ప్రిన్సిపల్ ఫేషియల్