Simple Job: చిన్న పని.. 30 కోట్ల జీతం
Simple Job: సింపుల్ పని.. జీతం మాత్రం 30 కోట్లు. ఎక్కడో తెలుసా? ఈజిప్ట్‌లో. ఇంతకీ ఉద్యోగం ఏంటో తెలుసా? అక్కడున్న ఓ లైట్ హౌస్‌లోని దీపాన్ని ఆన్‌లో ఉందా లేదా అని చూడటం. ఇంత చిన్న పనికి 30 కోట్లా అనుకుంటున్నారా? అక్కడే ఉంది కిటుకు. అసలు మ్యాటర్ ఏంటంటే.. అలెగ్జాండ్రియాలో ఓ లైట్ హౌస్ ఉంది. దీని పేరు ఫారోస్ ప్రపంచంలో నిర్మించిన తొలి లైట్ హౌస్ ఇదే. ఈ లైట్ హౌస్‌లోని లైట్ 24 గంటలూ వెలుగుతోందా లేదా అని చూసేందుకు ఓ వ్యక్తి కావాలట.
ఎంత పని చేస్తున్నావ్ అని అడిగేందుకు బాస్ ఉండడు. జస్ట్ ఆ లైట్ ఆన్‌లో ఉందా లేదా అని చూస్తే కాదు. మన ఇండియన్ కరెన్సీలో 30 కోట్ల జీతం అందుకోవచ్చు. ఇంత సింపుల్ పనిని ప్రపంచంలో ఎవడైనా వద్దనుకుంటాడా? కానీ ఎవ్వరూ ఈ పనికి ఒప్పుకోవడం లేదు. కారణం.. ఆ లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉంది. పైగా అక్కడ పనిచేసేవాడు ఒంటరిగా ఉండాలి. ఒక్కోసారి తుఫాను ప్రభావం వల్ల లైట్ హౌస్ నీటిలో మునిగిపోవచ్చు కూడా. పాత రోజుల్లో అలెగ్జాండ్రియాలోని సముద్రంలో ప్రయాణించే పడవలు రాత్రి కనపడక రాళ్లకు గుద్దుకుని మునిగిపోతుండేవి. అలా జరగకుండా ఉండేందుకు ఈ లైట్ హౌస్‌ను నిర్మించారు. 30 కోట్ల మేర జీతం ఇస్తామన్నా కూడా ఈ లైట్ హౌస్‌లో ఉండి పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు.