SIM Verification: ఇక నుంచి కొత్త రూల్స్

సిమ్ కార్డు వెరిఫికేష‌న్‌కు (sim verification) ఇక నుంచి కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. కొత్త సిమ్ కార్డు కావాలంటే పోలీస్, బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్ ఉండితీరాల్సిందేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సైబ‌ర్ నేరాల‌ను అడ్డుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ ఇది. మోస ప‌ద్ధ‌తుల ద్వారా క‌లెక్ట్ చేసిన‌ సిమ్ కార్డుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 52 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌నెక్ష‌న్ల‌ను బ్లాక్ చేసామ‌ని కేంద్ర‌మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. 67,000 మంది మోస‌పూరిత‌మైన సిమ్ కార్డు డీల‌ర్ల‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామ‌ని, వారిలో సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డిన వారి సంఖ్య 300 అని తెలిపారు. (sim verification)

సిమ్ వెరిఫికేష‌న్ కొత్త రూల్స్ ఇవే

కొత్త రూల్స్ ప్ర‌కారం సిమ్ కార్డులు అమ్మేవారు రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా పోలీస్‌, బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్ చేయించుకోవాలి. ఈ వెరిఫికేష‌న్ టెలికాం ఆప‌రేట‌ర్ ద్వారా జ‌రుగుతుంది. ఈ విధంగా వెరిఫికేష‌న్ చేయించుకోకుండా అక్ర‌మంగా సిమ్ కార్డులు అమ్ముతున్న‌ట్లు తెలిస్తే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు.

ప్ర‌స్తుత సెల్ల‌ర్ల‌కు 12 నెలల స‌మ‌యం

ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిమ్ కార్డు సెల్ల‌ర్ల‌కు త‌మ వ‌ద్ద ఉన్న సిమ్ కార్డుల వెరిఫికేష‌న్ చేయించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం 12 నెలల స‌మయం ఇచ్చింది. ఈ 12 నెల‌ల్లో అన్ని సిమ్ కార్డుల‌ను ప‌రిశీలించి వాటిలో రోగ్ సెల్ల‌ర్లు ఉన్నారేమో క‌నిపెట్ట‌డం జ‌రుగుతుంది. (sim verification)

డెమోగ్రాఫిక్ డేటా క‌లెక్ష‌న్

KYC ప్ర‌కారం.. వినియోగ‌దారులు కొత్త సిమ్ తీసుకోవాల‌న్నా లేదా వేరే నెట్‌వ‌ర్క్‌లోకి పోర్ట్ చేయించుకోవాల‌న్నా ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగ‌దారుడి డెమోగ్రాఫిక్ డేటాను సేక‌రిస్తారు.

ఒకేసారి బ‌ల్క్ సిమ్ కార్డులు ఇవ్వ‌డానికి లేదు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ క‌మ్యునికేష‌న్స్ బ‌ల్క్ సిమ్ కార్డులు విక్ర‌యించేందుకు అనుమ‌తులు ఇవ్వ‌దు. కేవ‌లం వ్యాపార రంగాల‌కు మాత్రమే ఈ స‌దుపాయం ఉంది. బిజినెస్ ప‌ర్పస్ కోసం తీసుకునేవారికి KYC ప్ర‌క్రియ ఉంటుంది. సాధార‌ణ వినియోగ‌దారులు ఒక గుర్తింపు కార్డుపై 9 సిమ్ కార్డుల వ‌ర‌కు తీసుకోవచ్చు. (sim verification)

సిమ్ డిస్‌క‌నెక్ష‌న్

కొత్త సిమ్ తీసుకోవాలంటే పాత సిమ్ డిస్‌క‌నెక్ట్ అయిన 90 రోజుల త‌ర్వాత కొత్త నెంబ‌ర్ కేటాయించ‌డం జ‌రుగుతుంది. ఒక‌వేళ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే వినియోగ‌దారుడు మ‌రోసారి KYC ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక పోయిన ఫోన్లు, సిమ్ కార్డుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం సంచార్ సాథీ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇల్లీగ‌ల్ మొబైల్ డివైజ్‌లను ప‌ట్టుకునే అవ‌కాశం ఉంది.