Canada: సిక్కు వ్యక్తిని కొడుకుని కాల్చి చంపిన దుండగులు
Canada: కెనడాలో భీకర వాతావరణం నెలకొంది. భాతర సంతతికి చెందిన సిక్కు వ్యక్తిని అతని కొడుకుని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఎడ్మోంటన్ ప్రాంతానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్ ఉప్పల్ (harpreet singh uppal) అనే హై ప్రొఫైల్ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. అతన్ని అతని 11 ఏళ్ల కుమారుడిని చంపేసారు.
ఒకప్పుడు కెనడాలో దుండగులు పిల్లల్ని చంపకుండా ఉండేవారని ఇప్పుడు ఆ రూల్ అతిక్రమిస్తున్నారని కెనడా పోలీస్ అధికారులు అంటున్నారు. హర్‌ప్రీత్ ప్రయాణిస్తున్న కారులో అతని కుమారుడితో పాటు పిల్లాడి స్నేహితుడు కూడా ఉన్నాడని.. కానీ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆ పిల్లాడు కారులోనే ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.
హర్‌ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ కేసు నమోదై ఉందని 2024 ఏప్రిల్‌లో ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా ఇంతలో అతను హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. బహుశా ఇతర నేరస్తుల పేర్లు ఎక్కడ బయటికి వస్తాయో అన్న కారణంగానే హర్‌ప్రీత్‌ను చంపేసినట్లు అనుమానిస్తున్నారు. 2021లో హర్‌ప్రీత్ కుటుంబం రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు కూడా అతనిపై ఎటాక్ జరిగిందని కానీ అప్పుడు వారు తప్పించుకున్నారని తెలిపారు.