Shubman Gill: త్వరలోనే పెళ్లి.. నోరుజారిన UAE ఆటగాడు
Shubman Gill: క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. సచిన్ తెందుల్కర్ (sachin tendulkar) కుమార్తె సారా తెందుల్కర్ (sara tendulkar) ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. చాలా మంది శుభ్‌మన్ సారాతో డేటింగ్‌లో ఉన్నాడు అంటుంటే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో (sara ali khan) అనుకున్నారు. కానీ ఆ సారా తను కాదని సారా అలీ ఖాన్ స్పష్టం చేసారు. సో.. శుభ్‌మన్ సారా తెందుల్కర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది.
అయితే త్వరలో శుభ్‌మన్ సారా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట. ఈ మాట ఎవరో కాదు UAE ఆటగాడు చిరాగ్ సూరి (chirag suri) అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో త్వరలో పెళ్లి చేసుకోబోయే ఆటగాడు ఎవరు అని సూరిని అడగ్గా.. శుభ్‌మన్ సారా అని చెప్పేసాడు. సారా కూడా శుభ్‌మన్ ఎప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడినా కూడా ఆ ఆటకు తప్పకుండా హాజరవుతోంది. శుభ్‌మన్ సిక్స్‌లు బాదినప్పుడు సంతోషంతో చప్పట్లు కొట్టడం.. ఔట్ అయ్యినా సరిగ్గా ఆడలేకపోయినా షాకైనట్లు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం వంటివి చేస్తూ తనకు శుభ్‌మన్ అంటే ఇష్టం ఉన్నట్లు హింట్స్ ఇస్తూనే ఉంది.