India vs Bangladesh: 67 పరుగులు తీస్తే ఆ రికార్డ్ గిల్‌దే..!
India vs Bangladesh: డెంగ్యూ కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (shubman gill). మొన్న జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇషాంత్ కిషన్‌ను రీప్లేస్ చేసాడు. అదే గిల్‌కి మొదటి వరల్డ్ కప్ మ్యాచ్. ఇక ఈరోజు పుణెలో జరగనున్న ఇండియా బాంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ (india vs bangladesh) గిల్ ఆడబోతున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో గనక గిల్ మరో 67 పరుగులు తీస్తే ODIలో 2000 పరుగులు సాధించిన ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డ్ సౌత్ ఆఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా (hashim amla) చేతిలో ఉంది. హషీమ్ ఈ రికార్డ్‌ని 40 ఇన్సింగ్స్‌లో సాధించాడు. మొన్న శనివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో గిల్ 16 పరుగులు తీయగలిగాడు. ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఏ రేంజ్లో విజృంభిస్తాడో వేచి చూడాలి.