Kolkata Rape Case: వాడికి బెయిల్ ఇవ్వమంటారా?
Kolkata Rape Case: కలకత్తాలో వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ విషయంలో సీబీఐ ఉదాసీనతగా వ్యవహరిస్తోంది. నిందితుడు బెయిల్‌కి అప్లై చేసుకోగా కలకత్తా హైకోర్టు నిన్న బెయిల్ వాదనలు వినాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ తరఫు న్యాయవాది నిందితుడికి బెయిల్ ఇవ్వాలని తన వాదనలు వినిపించేసారు. ఆ తర్వాత సీబీఐ తరఫు లాయర్ బెయిల్ ఇవ్వకూడదు అనే అంశంపై వాదించాల్సి ఉండగా.. సీబీఐ అధికారితో పాటు లాయర్ కూడా కోర్టుకు 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.
దాంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. సంజయ్ రాయ్ తరఫు న్యాయవాది బెయిల్ ఇవ్వాలనుంటారు.. మరి బెయిల్ ఇచ్చేయమంటారా? అని మండిపడ్డారు. ఈ కేసు గురించి న్యాయమూర్తికి కూడా పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో ఆమె సీబీఐ లాయర్ వచ్చే లోపే మరోసారి నిందితుడు సంజయ్‌ని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరగా కేసు పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయకుండా కోర్టు హియరింగ్‌కు రాకుండా జాప్యం చేస్తోందని ఆరోపించింది. ఈ కేసును సీబీఐ టేకప్ చేసి 24 రోజులు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదని మండిపడింది.