RBI: షాపులు రూ.2000 నోటు వ‌ద్ద‌న‌డానికి వీల్లేదు

Hyderabad: షాపులు రూ.2000 నోటును తిరస్క‌రించ‌డానికి వీల్లేద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంతా దాస్(shaktikanta das) స్ప‌ష్టం చేసారు. రెండు రోజుల క్రితం ఆర్‌బీఐ రూ.2000 నోటును విత్‌డ్రా చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు ఈ నోట్ల‌ను య‌థావిధిగా వాడుకోవ‌చ్చు. సెప్టెంబ‌ర్ 30లోపు రూ.2000 నోటును ద‌గ్గ‌ర్లోని బ్యాంకుల్లో ఎక్స్‌చేంజ్ చేసుకోవ‌చ్చు. అయితే రూ.2000 బ్యాన్ అయ్యాయి అనుకుని చాలా షాపులు ఈ నోటును తీసుకోవ‌డంలేద‌ట‌. దాంతో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు సెంట్ర‌ల్ బ్యాంక్ నోట్ల ఎక్స్‌చేంజ్‌కు టైం ఇచ్చింది. బ్యాంకుల్లో ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా ప్ర‌శాంతంగా క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర్వీస్ చేస్తార‌న్న ఉద్దేశంతోనే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు టైం ఇచ్చామ‌ని శ‌క్తికాంతా అన్నారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని తెలిపారు. ఇలాంటి నోట్ల విత్‌డ్రా చ‌ర్య‌లు ముందు ముందు కూడా జ‌రుగుతాయ‌ని, ఇది ఆర్‌బీఐ(rbi) క్లీన్ నోట్ పాల‌సీలో భాగంగా చేప‌డుతున్న చ‌ర్య అని పేర్కొన్నారు.