Kolkata Rape Case: షాకింగ్ ట్విస్ట్.. మాట మార్చిన నిందితుడు

shocking twist in kolkata rape case

Kolkata Rape Case: క‌ల‌క‌త్తా అత్యాచార ఘ‌ట‌న విచార‌ణ‌లో భాగంగా నిన్న సీబీఐ నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ (లై డిటెక్ట‌ర్) టెస్ట్ చేసింది. టెస్ట్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఒక‌లా స‌మాధానం చెప్పిన సంజ‌య్ రాయ్.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అవే ప్ర‌శ్న‌లు అడుగుతుంటే మార్చి చెప్ప‌డంతో అధికార‌లు త‌ల‌ప‌ట్టుకున్నారు. రెండోసారి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయ‌గా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అస‌లు తాను అత్యాచారం చేయ‌లేద‌ని.. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లేస‌రికే ఆ వైద్యురాలు హ‌త్య‌కు గురై ఉంద‌ని అన్నాడు. అమెను చూసి తాను హాస్పిట‌ల్ నుంచి ప‌రార‌య్యాన‌ని చెప్తున్నాడు. త‌న‌ను కావాల‌నే ఈ కేసులో కొంద‌రు ఇరికించాల‌ని చూస్తున్నార‌ని.. హ‌త్యాచారం తానే చేసిన‌ట్లు ఒప్పుకోమంటున్నార‌ని అంటున్నాడు.

పాలిగ్రాఫ్ టెస్ట్‌లో సీబీఐ సంజ‌య్‌ను అడిగిన ప్ర‌శ్న‌లు

నీ పేరు సంజ‌య్ రాయా?

హ‌త్యాచార ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు నువ్వు ఆర్జీ క‌ర్ హాస్పిట‌ల్‌లోనే ఉన్నావా?

నువ్వెప్పుడైనా అబ‌ద్ధాలు చెప్పావా?

ఆ అమ్మాయిని నువ్వే రేప్ చేసావా?

ఆమెను రేప్ చేసి చంపేసావా?

ట‌మాటా రంగు ఎరుపా?

ఈ ఘ‌ట‌న‌లో ఇంకెవ‌రైనా ఉన్నారా?

మ‌ర్డ‌ర్ చేసాక హాస్పిట‌ల్ నుంచి పారిపోయావా?

గ‌తంలో ఆమెను లైంగికంగా ఇబ్బంది పెట్టావా?

నువ్వు పోర్న్ చూస్తావా?

మ‌ర్డ‌ర్‌కి ముందు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లావా?

సెమినార్ హాల్‌లో నీ బ్లూటూత్ విరిగిపోయిందా?

అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నువ్వు స‌రైన స‌మాధానాలు ఇచ్చావా?

ఈ పై ప్ర‌శ్న‌ల‌కు ముందు ఒక‌లా స‌మాధానం చెప్పి ఆ త‌ర్వాత మ‌రోలా చెప్ప‌డంతో అధికారులు మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టాల‌ని అనుకుంటున్నారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌కి ముందు సంజ‌య్‌లో భ‌యం కానీ టెన్ష‌న్ కానీ ఇసుమంతైనా క‌నిపించ‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు.