Viral News: “నిద్రలేచేసరికి అతను నన్ను రేప్ చేస్తున్నాడు”
Viral News: ముంబైకి చెందిన ఓ 21 ఏళ్ల యువతి తనకు సాయం చేయండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ యావత్ భారత్‌ను షాక్‌కు గురి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన హీతిక్ సింగ్ అనే యువకుడితో ఫ్రెండ్షిప్ చేసిన ఆ యువతి ఒక రోజంతా అతనితో పార్టీ చేసుకోవాలని అనుకుంది. ఇందుకోసం వారిద్దరూ ముంబైలోని లోకల్ బార్‌కు వెళ్లారు. అక్కడ బాగా తాగారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూసేసరికి హీతిక్ తనను రేప్ చేస్తూ కనిపించాడు. దాంతో గట్టిగా కేకలు వేసింది. హీతిక్ ఆపకుండా ఆమెను దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను బయట వదిలేసి పారిపోయారు. బాధితురాలు తన అన్నకు కాల్ చేసి పిక్ చేసుకోవాలని చెప్పింది. ఈ విషయం ఇంట్లో తెలీడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతున్నా హీతిక్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని పోలీసులను ప్రశ్నిస్తే అతను ముందస్తు బెయిల్ తీసుకున్నట్లు తెలిసింది. రేప్ జరిగిన మరుసటి రోజు ఆ అమ్మాయికి సారీ అని ఒక మెసేజ్ పెట్టి కనిపించకుండాపోయాడట. అమ్మాయిలు ఎవరితో మాట్లాతున్నారో ఎలాంటి వారితో బయటికి వెళ్తున్నారో జాగ్రత్తగా గమనించుకోవాలని.. ఎవరైనా తెలిసిన మహిళా ఎన్జీవోలు కానీ సంఘాలు కానీ తెలిస్తే తనకు వివరాలు పంపాలని ఆ యువతి కోరింది.