Mohanbabu: మోహ‌న్‌బాబు విద్యాసంస్థ‌ల్లో దౌర్జన్యం?

shocking allegations on mohan babu related schools and colleges

Mohanbabu: ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబుకి చెందిన విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌ల్లో దౌర్జ‌న్యం జ‌రుగుతోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరెంట్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఈశ్వ‌ర‌య్య మీడియా ముందుకొచ్చి షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. అడ్డ‌గోలుగా ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌ని విద్యార్థుల చేత బ‌ల‌వంతంగా యూనిఫాం కొనేలా చేస్తున్నార‌ని.. డే స్కాల‌ర్లు క‌చ్చితంగా మెస్‌లోనే తినాలని రూల్ పెట్టారంటూ ఆయ‌న ఆరోపిస్తున్నారు. విద్యార్థులు మాట విన‌క‌పోతే బౌన్స‌ర్ల చేత కొట్టిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. దీనిపై విద్య‌ర్థుల త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. టీచింగ్ స్టాఫ్‌కి కూడా స‌మ‌యానికి జీతాలు చెల్లించ‌డంలేదంటూ విద్యానికేత‌న్‌పై AICTEకి ఫిర్యాదు చేసారు.