Shoaib Malik: సానియాకు విడాకులు ఇవ్వకుండానే మూడేళ్లుగా డేటింగ్!
Shoaib Malik: పాకిస్థానీ క్రికెటర్ షోయెబ్ మాలిక్.. సానియా మీర్జా (sania mirza) విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల షోయెబ్ బుల్లితెర నటి సనా జావేద్ (sana javed) అనే యువతిని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఇది షోయెబ్‌కు మూడో పెళ్లి. అయితే సానియాకు విడాకులు ఇవ్వకుండానే షోయెబ్ సనాతో మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నాడట. సనాకు ఆల్రెడీ ఉమైర్ జస్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ వీరి పెళ్లి జరిగిన మూడు నెలలకే విడిపోయారు. అప్పటికే షోయెబ్ సనా జీవితంలో ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానిక సమా అనే టీవీ ఛానెల్ బయటపెట్టడంతో చర్చనీయాంశంగా మారింది. సానియాకు ఈ విషయం తెలిసి నచ్చజెప్పాలని చూసినా షోయెబ్ వినలేదట. దాంతో ఇక చేసేది లేక సానియా షోయెబ్ విడాకులు తీసుకున్నారు.