Shanmukh: ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుని.. డ్ర‌గ్స్‌కి బానిసై..!

Shanmukh: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ షణ్ముఖ్ జ‌శ్వంత్ కేసులో కొత్త కోణం బ‌య‌టికి వ‌చ్చింది. కొన్ని రోజుల క్రితం ష‌ణ్ముఖ్ డ్ర‌గ్స్‌తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఓ యువ‌తిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన షణ్ముఖ్ సోద‌రుడు సంప‌త్ విన‌య్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అత‌ని ఇంటికి వెళ్లగా.. అక్క‌డ షణ్ముఖ్ డ్ర‌గ్స్‌తో దొరికిపోయాడు. దాంతో పోలీసులు ఇద్ద‌రినీ అరెస్ట్ చేసారు. ఆ త‌ర్వాత దిలీప్ సుంక‌ర ష‌ణ్ముఖ్‌ను బెయిల్‌పై రిలీజ్ చేయించారు. అయితే ష‌ణ్ముఖ్ కేసు విష‌యంలో మ‌రో కోణం బ‌య‌ట‌పడింది. త‌న మాన‌సిక ప‌రిస్థితి బాగోలేద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని అందుకే డ్ర‌గ్స్ తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని ష‌ణ్ముఖ్ పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

పోలీసులు అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు తీసుకెళ్ల‌గా ష‌ణ్ముఖ్‌ను వీడియో తీస్తుండ‌గా.. నాకు గంజాయితో సంబంధం లేదు.. నాకు ఏం తెలీదు అంటూ పోలీసుల‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. ఆ త‌ర్వాత ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసారు. రిపోర్టుల్లో గంజాయి తీసుకున్న‌ట్లు పోలీసుల‌కు నిర్ధార‌ణ అయ్యింది. దాంతో ష‌ణ్ముఖ్‌ను గంజాయి క‌న్స్యూమ‌ర్‌గా పోలీసులు నిర్ధారించి కేసు ఫైల్ చేసారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. సంప‌త్ విన‌య్ మౌనిక అనే యువ‌తిని చీటింగ్ చేసిన వ్య‌వ‌హారంలోనే చీటింగ్ కేసు న‌మోదు చేసారు.

ALSO READ: Shanmukh: ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుని.. డ్ర‌గ్స్‌కి బానిసై..!

గంజాయి వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రో కేసును న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సంప‌త్ విన‌య్ జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్నాడు. అయితే.. ఎప్పుడైతే పోలీసులు నార్సింగిలోని సంప‌త్ విన‌య్ ఫ్లాట్‌కి వెళ్లారో అక్క‌డ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ గంజాయి తీసుకుంటున్న‌ట్లు క‌నిపించ‌గానే వీడియోలు తీయ‌డం మొద‌లుపెట్టారు. అప్పుడే జ‌శ్వంత్ ఏడుస్తూ నాకు ఎంతో కాలంగా డిప్రెష‌న్‌లో ఉన్నాను.. నా ప‌రిస్థితి బాలేదు.. నేను చ‌నిపోబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అదే స‌మ‌యంలో సంప‌త్ వినయ్ మౌనిక‌తో వీడియోలో మాట్లాడుతున్న విజువ‌ల్స్ కూడా బ‌య‌టికి వ‌చ్చాయి.

ష‌ణ్ముఖ్ ఎంత కాలం నుంచి డిప్రెష‌న్‌లో ఉన్నాడు? నిజంగానే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడా? అనే విష‌యాల‌కు సంబంధించి కూడా అనేక ప్ర‌శ్న‌లు బ‌య‌టికి వ‌స్తున్నాయి. అయితే.. వాస్త‌వానికి ష‌ణ్ముఖ్‌కు సంబంధించి గ‌త కొంత‌కాలంగా అనేక విష‌యాలు కూడా వ్య‌తిరేకంగానే వ‌స్తున్నాయి. గ‌తంలో అత‌ను బిగ్‌బాస్‌కి వెళ్ల‌డానికి ముందు హిట్ అండ్ ర‌న్ కేసుకు సంబంధించిన ప‌ట్ట‌బ‌డ్డాడు. ఆరోజు కూడా మ‌ద్యం సేవించి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఒక వాహ‌నాన్ని ఢీకొని పారిపోయే ప్ర‌య‌త్నం చేసాడు కానీ ఆ త‌ర్వాత పోలీసుల‌కు లొంగిపోయాడు. ఆ కేసు కూడా వివాదాస్ప‌దంగా మారింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొంత‌కాలానికి బిగ్ బాస్‌కు వెళ్లిన త‌ర్వాత కూడా బిగ్ బాస్ హౌజ్‌లో మ‌రో కంటెస్టెంట్‌తో కొంత స్నేహం పేరుతో శ్రుతి మించి ప్ర‌వ‌ర్తించాడు అని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అప్ప‌టికే అత‌నికి బ‌య‌ట ఒక ప్రేయసి ఉండి కూడా మ‌రొక‌రితో శ్రుతి మించి ప్ర‌వ‌ర్తించాడని కూడా అన్నారు. ఇవ‌న్నీ మ‌రుక‌వ ముందే గంజాయి కేసులో ఇరుక్కున్నాడు.

ష‌ణ్ముఖ్ సాధార‌ణంగా బిగ్ బాస్ కంటే ముందుగానే యూట్యూబ‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ్య‌క్తి. ఆయ‌న న‌టించిన వెబ్ సిరీస్‌లు.. ఓటీటీ కంటెంట్.. ఇవ‌న్నీ కూడా చాలా పాపుల‌ర్ అయ్యాయి. అటువంటి వ్య‌క్తి డిప్రెష‌న్‌లోకి వెళ్ల‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది అనే దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫ‌లం అయిన కార‌ణంగానే ఇవ‌న్నీ జ‌రిగాయా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంకో విష‌యం ఏంటంటే.. ఇప్పుడు సంప‌త్ విన‌య్‌పై ఫిర్యాదు చేసిన మౌనిక అనే యువ‌తిని మొద‌ట సంప‌త్ విన‌య్‌కు ప‌రిచ‌యం చేసింది కూడా ష‌ణ్మ‌ఖే అని తెలుస్తోంది. అత‌ని ద్వారానే సంప‌త్ విన‌య్‌, మౌనిక ప్రేమించుకున్నార‌ట‌. కానీ పెళ్లి చేసుకుందామ‌ని చెప్పి మ‌రో అమ్మాయితో వివాహానికి సంప‌త్ విన‌య్ రెడీ అవ‌డంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.