Serial Killer: మ‌హిళ‌ల‌ను చంప‌డంలో థ్రిల్.. 42 మంది ఆడ‌వాళ్ల‌ను హ‌త్య చేసిన సీరియ‌ల్ కిల్ల‌ర్ అరెస్ట్

Serial Killer who killed 42 women finally caught

Serial Killer: అత‌డికి ఆడ‌వాళ్ల‌ను చంపితే అదో థ్రిల్. అలా ముందు భార్య హ‌త్య‌తో మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత రెండేళ్ల కాలంలో ఏకంగా 42 మంది ఆడ‌వాళ్ల‌ను అతి దారుణంగా న‌రికి చంపాడు. ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ఎట్ట‌కేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న కెన్యాలో చోటుచేసుకుంది. కాలిన్స్ ఖ‌లూషా అనే 33 ఏళ్ల వ్య‌క్తి రెండేళ్ల క్రితం త‌న భార్య‌ను గొంతు నులిమి చంపేసాడు. ఆ త‌ర్వాత ఆమె మృత‌దేహాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి ద‌గ్గ‌ర్లోని నదిలో ప‌డేసాడు. భార్య‌ను చంపిన త‌ర్వాత అత‌నికి ఆడ‌దాన్ని చంప‌డం థ్రిల్లింగ్‌గా అనిపించ‌ద‌ట‌.

ఇక అక్క‌డి నుంచి అత‌డి వేట మొద‌లైంది. ఆడ‌వాళ్ల‌కు మాయ‌మాట‌లు చెప్పి త‌న వ‌ద్ద‌కు ర‌ప్పించుకుని దారుణంగా న‌రికి చంపుతుండేవాడు. కొంద‌రి మృత‌దేహాల‌ను ఊర్ల చివ‌ర్లో విసిరేసేవాడు. ఇంకొందరి మృతదేహాల‌ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేవారు. కాలిన్స్ ఆగ‌డాలు ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో కెన్యా పోలీసులు గ‌ట్టి నిఘా పెట్టారు. అలా అత‌న్ని నిన్న యూరో 2024 ఫుట్‌బాల్ గేమ్‌ను చూసేందుకు వెళ్లిన‌ప్పుడు పోలీసులు ప‌ట్టుకున్నారు. చేసిన హ‌త్య‌ల‌న్నింటినీ ఒప్పుకున్న కాలిన్స్ ఎందుకు చేసావు అని అడిగితే మాత్రం త‌న‌కు ఆడ‌వాళ్ల‌ను చంపితే అదోలాంటి థ్రిల్ వ‌స్తుంద‌ని చెప్తున్నాడు.