Miyapur: మైనర్ బాలిక హత్య కేసులో సంచలనం.. కోరిక తీర్చలేదని తండ్రే చంపేసాడు
Miyapur: హైదరాబాద్లోని మియాపూర్లో ఇటీవల 12 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మియాపూర్ ఏసీపీ నరసింహారావు వివరాలు వెల్లడించారు. బాలికను చంపింది మరెవరో కాదని.. కన్న తండ్రే అని ఆయన షాకింగ్ విషయాలు వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉంటున్నారు. ఈనెల 7న వారి పెద్ద కుమార్తె (12) కిరాణా షాపు వద్దకి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చుట్టుపక్కల ప్రాంతాలు వెతకగా చివరికి వారం రోజుల తరువాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.
పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని.. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేదని ఆ రోజు తల్లిదండ్రులు రోదించారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టగా నిందితుడు బాలిక తండ్రే అని కోరిక తీర్చలేదన్న కోపంతోనే బాలికను అపహరించి దారుణంగా తగలబెట్టి చంపేసాడని వెల్లడించారు. పోర్న్ వీడియోలు చూస్తూ తన ఫోన్ పగిలిపోవడంతో కన్న కూతురినే కోరిక తీర్చాలని అడిగాడు. బాలిక తల్లికి చెబుతానని అనడంతో కోపంతో కన్న బిడ్డ అని కూడా చూడకుండా చంపేసాడు. మళ్లీ ఏం తెలియనట్లు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వైనం.