Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ షాక్
Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) షాకిచ్చింది. అనిల్ అంబానీతో పాటు మరో 24 మందిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. రూ.25 కోట్ల వరకు జరిమానా విధిస్తూ ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని నోటీసులు అందించింది. అంతేకాదు లిస్ట్ అయిన ఏ కంపెనీకి కూడా డైరెక్టర్‌గా వ్యవహరించకూడదు అని పేర్కొంది.
అనిల్‌కి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ (RHFL)కు రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ ఆరు నెలల పాటు మార్కెట్‌లో పాల్గొనకూడదని సెబీ తేల్చి చెప్పింది. RHFL బోర్డు నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ అనిల్‌తో పాటు RHFLకి చెందిన 25 మంది ఎగ్జిక్యూటివ్స్ RHFLకి అనుసంధానంగా ఉన్న ఇతర కంపెనీలకు లోన్లు ఇచ్చి కంపెనీ ఫండ్స్‌ను డైవర్ట్ చేసారు. ఏవైతే కంపెనీలకు లోన్లు ఇచ్చారో వాటికి ఆర్థిక స్థిరత్వం లేదు. దాంతో ఆ రుణాలను దుర్వినియోగం చేసారు. దీని వల్ల RHFLకు తీవ్ర నష్టం వాటిల్లింది. RHFL స్టాక్స్ పడిపోవడంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన దాదాపు 9 లక్షల మంది పెట్టుబడిదారులు నష్టపోయారు.