Anil Ambani: అనిల్ కొడుక్కి SEBI జరిమానా
Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీకి సెబీ ఫైన్ వేసింది. రియలయ్స్ హోం ఫైనాన్సెస్లో పలు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రూ.1 కోటి జరిమానా విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ ఇచ్చిన లోన్ల విషయంలో జై అన్మోల్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని.. ముఖ్యంగా వేరే కంపెనీల నుంచి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ADAG గ్రూప్‌లోని ఇతర సంస్థలకు లోన్లు మంజూరు చేసారని సెబీ స్పష్టం చేసింది. వీసా క్యాపిటల్ పార్ట్నర్స్, అక్యూరా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలకు జై అన్మోల్ ఎలాంటి భద్రత లేకుండా రూ.40 కోట్ల లోన్ మంజూరు చేసాడు. పైగా ఆ లోన్లకు సంబంధించిన అధికారిక మెయిల్స్‌లో కూడా జై అన్మోల్ ఏదో వాట్సాప్ భాషలో సమాధానాలు ఇచ్చినట్లు సెబీ కనుగొంది.
అసలు కంపెనీ కోసం రోజూ వచ్చి పనిచేయని అన్మోల్ ఎలా ఇంతటి భారీ మొత్తంలో లోన్లు సాన్క్షన్ చేస్తారని సెబీ మండిపడింది. ఇటీవల అనిల్ అంబానీకి కూడా సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. ఐదేళ్ల క్రితం రిలయన్స్ హోం ఫైనాన్స్ ద్వారా మోసపూరిత పథకాలను ప్రవేశపెట్టినందుకు గానూ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కూడా బ్యాన్ చేసింది.