AI సాయంతో రాబోతున్న సెక్స్ రోబోలు..!
Sex Robots: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏవేవో మార్కెట్‌లోకి రిలీజ్ అవుతున్నాయి. అయితే.. ఇప్పుడు సెక్స్ టాయ్స్, సెక్స్ రోబోలను కూడా మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నారట. చైనాకి చెందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి సెక్స్ రోబోలను డిజైన్ చేస్తున్నారు. ఈ రోబోలు మనుషులతో సాధారణ వ్యక్తుల్లా మాట్లాడేలా డిజైన్ చేయబోతున్నారట. చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన స్టార్పెరీ టెక్నాలజీ అనే కంపెనీ ఈ సెక్స్ రోబోలను తయారుచేస్తోంది. ఇందుకోసం చాట్ జీపీటీ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
మేల్, ఫీమేల్ రోబోలను ఈ కంపెనీ మార్కెట్‌లో విడుదల చేయనుంది. వీటికి సంబంధించిన మొదటి వెర్షన్లు ఆగస్ట్ నాటికి మార్కెట్‌లో లభించనున్నాయి. సాధారణ రోబోలైతే సింపుల్‌గా మనం అడిగే దానికి సమాధానం ఇస్తాయి. కానీ ఈ AI టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసే రోబోలు మన భావాన్ని అర్థంచేసుకుని దానికి తగ్గట్టు మాట్లాడేలా డిజైన్ చేయనున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ రోబోలు మనుషులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. కేవలం శారీరక అవసరాలకే కాకుండా ఇంట్లో పనులు చేయడానికి.. వృద్ధులకు సాయంగా ఉండటానికి కూడా ఈ కంపెనీ రోబోలను తయారుచేస్తోంది. ప్రస్తుతం ఈ రోబోలను తయారుచేయడానికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే.. బ్యాటరీ లిమిటేషన్.. కృత్రిమ కండరాలు. అయితే ఈ అడ్వాన్స్‌డ్ రోబోల వల్ల వ్యక్తుల ప్రైవేట్ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని.. ఇందుకోసం కొన్ని నిబంధనలను అమల్లోకి తేవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.