స్కూల్లో యానిమేటెడ్ సెక్స్ చూపించిన టీచ‌ర్

school teacher shows animated sex to kids

School: ప‌దేళ్ల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఓ స్కూల్ టీచ‌ర్ యానిమేటెడ్ సెక్స్ వీడియోలు చూపించ‌డం అమెరికాలో వివాదాస్ప‌దంగా మారింది. ఒహాయోలోని టాల్‌మ్యాడ్జ్ సిటీ స్కూల్‌లోని టీచ‌ర్లు అమేజ్ అనే వెబ్‌సైట్ ద్వారా యానిమేటెడ్ సెక్స్ వీడియోల‌ను పిల్ల‌ల‌కు చూపించార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఒహాయోకి చెందిన కికి అనే మ‌హిళ స్కూల్‌లో రాద్దాంతం చేసారు.

త‌న కూతురు అదే స్కూల్‌లో చ‌దువుతోంద‌ని.. ఉన్న‌ట్టుండి ఓ అప్లికేషన్ ఫాం తీసుకొచ్చి త‌న సంత‌కం కావాల‌ని కోరింద‌ని వెల్ల‌డించింది. ఆ ఫాం ఏంటా అని చదివితే అందులో హెల్త్ ఎడ్యుకేష‌న్ పేరుతో సెక్స్, హ‌స్త ప్ర‌యోగం వంటి అంశాల‌ను యానిమేటెడ్ రూపంలో చూపిస్తున్న‌ట్లు ఉంద‌ని ర‌చ్చ చేసింది. వెంట‌నే స్కూల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇలాంటి టాపిక్స్ ఇప్ప‌టి నుంచే చెప్తే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో ఊహించ‌డానికే భ‌యంగా ఉంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టికే టీనేజ‌ర్లు ఏకంగా స్కూల్ టీచ‌ర్ల‌తోనే లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.