SBI: EMI కట్టనివారికి చాక్లెట్లు..!
లోన్ తీసుకుని నెల నెలా EMIలు కట్టనివారికి చాక్లెట్లు పంపి నేరుగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సెక్టర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi). ఈ మధ్యకాలంలో లోన్లు తీసుకుంటున్న కస్టమర్ల సంఖ్య ఎక్కువ అయిపోయిందని.. కానీ EMIలు కట్టే దగ్గరికి వస్తే కొన్ని నెలల పాటు ఎగ్గొడుతున్నారని తెలిపింది. ఇకపై వారికి ఫోన్లు చేయకుండా చాక్లెట్ డబ్బాలతో నోటీసులు కూడా ఇవ్వకుండా వారి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు పేర్కొంది.
ఇలా EMIలు కట్టకుండా కావాలని ఫోన్ కాల్స్ ఎత్తకుండా ఇగ్నోర్ చేస్తున్న కస్టమర్లకు బుద్ధి చెప్పేందుకు SBI ఓ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా SBI ఆర్టిఫిషియల్ ఇన్‌టెలిజెన్స్‌తో పనిచేసే రెండు ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యం అయింది. ఈ రెండు ఫిన్‌టెక్ కంపెనీలలో ఒక కంపెనీ కస్టమర్లకు సర్దిచెప్పి చెల్లింపులు సకాలంలో అయ్యే పనిలో ఉంటుంది. మరో కంపెనీ లోన్ తీసుకున్న కస్టమర్లు గతంలో ఏవైనా లోన్లు తీసుకున్నారా? తీసుకుంటే టైంకి చెల్లించేసారా? ఒకవేళ చెల్లించకపోతే ఎన్ని నెలల పాటు తప్పించుకోగలిగారు వంటి వివరాలు సేకరించి SBIకి పంపుతుంది.
ఒకవేళ లోన్ ఎగ్గొట్టాలని చూస్తున్న కస్టమర్లు ఉంటే.. ఈ ఫిన్‌టెక్ కంపెనీలోని ఉద్యోగులు ఓ చాక్లెట్ ప్యాకెట్‌తో నేరుగా ఆ కస్టమర్ ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. ఇది ఇంకా ప్లానింగ్ దశలోనే ఉందని ఆ రెండు ఫిన్‌టెక్ కంపెనీల పేర్లు ఇప్పుడే చెప్పలేమని SBI తెలిపింది.