ఒకే రోజు ఏడుగురిని ఉరితీసిన సౌదీ
Saudi Arabia: అత్యధికంగా ఉరితీసే దేశాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో సౌదీ అరేబియా ఈరోజు ఒక్కరోజే ఏకంగా ఏడుగురిని ఒకేసారి ఉరితీసింది. వారిలో ముగ్గురి డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఉరితీయగా.. మరో ఇద్దరిని హత్య చేసినందుకు ఉరితీసింది. ఈ ఏడు ఉరిశిక్షలతో కలిపి 2024లో సౌదీ మొత్తం 236 మందిని ఉరితీసింది. ఏడుగురిలో నలుగురు యెమెన్‌కి చెందినవారు కాగా.. ఒకరు పాకిస్థానీ. రెండేళ్ల క్రితమే నిషేధించిన ఉరిశిక్ష చట్టాన్ని సౌదీ ఎత్తివేసింది. అప్పటి నుంచి ఏ డ్రగ్స్ కేసులో నిందితులు పట్టుబడినా వారిని వెంటనే ఉరితీసేస్తోంది. సిరియా, లెబనన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న క్యాప్టాగాన్ అనే డ్రగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు సౌదీ డ్రగ్ మాఫియాపై కొరడా ఝళిపించింది. ఉరిశిక్షలు విపరీతంగా అమలు చేసే దేశాల్లో చైనా, ఇరాన్ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా సౌదీ మూడో స్థానంలో ఉంది.