Satya Nadella: ఆస్ట్రేలియా టీంను కొనేస్తారా..?
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు చిక్కు ప్రశ్న ఎదురైంది. ఇండియా ఆస్ట్రేలియా (ind vs aus) మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ కప్ (world cup) ఆస్ట్రేలియా సొంతం అయిన నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ ఛానెల్ యాంకర్ ఆయన్ను ఓ ప్రశ్న అడిగింది. ఓపెన్ ఏఐ సంస్థ తొలగించిన సీఈఓ సామ్ ఆల్ట్‌మ్యాన్‌ను (sam altman) తమ కంపెనీలోకి ఆహ్వానించి పెద్ద పదవి ఇచ్చినట్లే.. ప్రపంచ కప్ ఎత్తుకుపోయిన ఆస్ట్రేలియాను కొనేస్తారా అని అడిగింది.
ఆస్ట్రేలియాను కొనుగోలు చేయడం అనేది ఓపెన్ ఏఐ మొత్తాన్నే కొనుగోలు చేసినట్లు అవుతుందని అది జరిగే పని కాదు కాబట్టి ఓపెన్ ఏఐతో కలిసి పనిచేయడం.. ఆస్ట్రేలియా ఆడే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయడం వరకు అయితే బాగుంటుందని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.