Kolkata Rape Case: రెడ్ లైట్ ఏరియాకి వెళ్లాను కానీ సెక్స్ చేయలేదు
Kolkata Rape Case: కలకత్తా రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు నిన్న సీబీఐ లై డిటెక్టర్ టెస్ట్ చేసింది. ఈ టెస్ట్‌లో సంజయ్ కొన్ని విషయాలను వెల్లడించాడు. వైద్యురాలిపై హత్యాచారం చేయడానికి ముందు రోజు రాత్రి తాను రెడ్ లైట్ ఏరియాకు వెళ్లిన మాట నిజమే కానీ సెక్స్ చేయలేదని చెప్పాడు. ఆ తర్వాత వీధిపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై దాడి చేసానని.. అది స్థానిక సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయ్యిందని చెప్పాడు. అంతేకాకుండా తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి నగ్న ఫోటోలు పంపాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పాడు.
లై డిటెక్టర్ టెస్ట్‌లో సంజయ్ రాయ్ వెల్లడించిన వివరాలివీ..
ఆగస్ట్ 8: RG కర్ మెడికల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తన స్నేహితుడి సోదరుడిని పరామర్శించడానికి వెళ్లాను. ఆ సమయంలో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు.
అదే రోజు రాత్రి 11:15 గంటలకు : నేను నా స్నేహితుడు హాస్పిటల్ నుంచి వెళ్లాక తాగుదాం అనుకున్నాం. ఆల్కహాల్ కొనుగోలు చేసి రోడ్డుపైనే తాగాం.
ఆ తర్వాత ఉత్తర కలకత్తాలోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాం
అక్కడ వర్కవుట్ కాలేదని దక్షిణ కలకత్తాలోని చేట్లా అనే మరో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాం
చేట్లాకు వెళ్తున్న సమయంలోనే రోడ్డుపై వెళ్తున్న ఓ అమ్మాయిని వేధించాం
చేట్లాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాక నా స్నేహితుడు వేశ్య వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో నేను బయటే ఉన్నాను. అప్పుడే నా ప్రియురాలికి వీడియో కాల్ చేసి నగ్న ఫోటోలు అడిగాను. తను ఫోటోలు పంపింది.
ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాం. నేను నాలుగో అంతస్తులో ఉన్న ట్రౌమా సెంటర్‌కు వెళ్లాను.
మరుసటి రోజు తెల్లవారుజామున 4:03 గంటల సమయంలో: మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వైపు వెళ్లాను. అక్కడ నాకు ఆ అమ్మాయి నిద్రపోతూ కనిపించింది. ముందు ఆమె గొంతు నులిమాక తనపై అత్యాచారం చేసాను. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ అయిన అనుపమ్ దత్తా స్నేహితుడి ఇంటికి వెళ్లాను.
ఇవన్నీ సంజయ్ రాయ్ నిన్న లై డిటెక్టర్ టెస్ట్‌లో వెల్లడించిన అంశాలు. మరోపక్క సీబీఐ దగ్గరున్న కాల్ డేటా రికార్డుల ఆధారంగా సంజయ్ చెప్పినవన్నీ నిజాలే అని నిర్ధారించారు.