Sachin Tendulkar: గిల్ ముంబై కోసం ఆడాడు..!

Hyderabad: శుభ్‌మ‌న్ గిల్(shubhman gill) ముంబై ఇండియ‌న్స్ కోసం బాగా ఆడాడంటూ మాజీ క్రికెట‌ర్ స‌చిన్ తెందూల్క‌ర్(sachin tendulkar) అన్నారు. నిన్న జ‌రిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్(rcb vs gt) మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ సెంచ‌రీతో చిత‌క్కొట్టాడు. దాంతో ఆర్సీబీ(rcb) ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌లేక‌పోయింది. గుజ‌రాత్ టైటాన్స్(gujarat titans) గెల‌వ‌డంతో.. ముంబై ఇండియ‌న్స్(mumbai indians) ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. ఈ నేప‌థ్యంలో స‌చిన్ తెందుల్క‌ర్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. “విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచ‌ర‌ల‌తో అద‌ర‌గొట్టాడు. ఆర్సీబీ మెథ‌డ్స్ వేరు. ఎవ‌రికి వారే సాటి. ఇక శుభ్‌మ‌న్ గిల్ ముంబై ఇండియన్స్ కోసం బాగా ఆడాడు” అని ట్వీట్ చేసారు. స‌చిన్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, యువ‌రాజ్ సింగ్ కూడా శుభ్‌మ‌న్‌ను ప్ర‌శంసించారు. అయితే స‌చిన్ ఇలా ట్వీట్ చేయ‌డం కాస్త వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే.. స‌చిన్ కూతురు సారా తెందూల్క‌ర్.. శుభ్‌మ‌న్ గిల్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వస్తున్నాయి. ముంబైని ప్లే ఆఫ్స్‌కు పంపించిన కాబోయే అల్లుడిని చూసి స‌చిన్ ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఐపీఎల్ సీజ‌న్ ముగిసాక శుభ్‌మ‌న్, సారాల ల‌వ్ స్టోరీపై స‌చిన్ ఏమ‌న్నా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేస్తారేమో వేచి చూడాలి.