Kerala లో రష్యా అధ్యక్ష ఎన్నికలు ఎందుకు జరిగాయి?
Kerala: రష్యాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆ ఎన్నికలను మన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో నిర్వహించారు. ఎందుకో తెలుసుకుందాం.
కేరళలో చాలా మంది రష్యా దేశస్థులు కూడా నివసిస్తున్నారు. వారికి ఆన్‌లైన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోని పరిస్థితి. అలాగని ఓటు వెయ్యడానికి రష్యాకు కూడా వెళ్లలేరు. దాంతో కేరళలో ఉంటున్న రష్యా దౌత్యకార్యాలయ అధికారులు కేరళలోనే రష్యన్ వాసులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోలింగ్ ప్రక్రియలో సజావుగా సాగుతోందని అధికారి రతీష్ నాయర్ తెలిపారు. ఇలా రష్యా వాసులు కేరళ నుంచి ఓటెయ్యడం ఇది తొలిసారేం కాదని.. ఇది మూడోసారని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం తమకు ఇంతగా సహకరిస్తుండడం నిజంగా గొప్ప విషయం అని అన్నారు. కేరళలో నివసిస్తున్న రష్యా వాసులకే కాదు.. పర్యాటకులుగా వచ్చిన వారికి కూడా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు.