Russia: సొంత సైనికులను ఎందుకు ఉరితీస్తోంది?
రష్యా (russia) ప్రభుత్వం సొంత సైనికులను ఉరితీస్తోందట. ఆర్డర్లు ఫాలో అవ్వని వారిని ఉరి తీస్తున్నారని వైట్‌హౌస్ (white house) ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ (ukraine) యుద్ధంలో భాగంగా ఆ దేశ సైనికులు దాడి చేస్తున్నప్పుడు ప్రతిదాడి చేయకుండా వెనక్కి తగ్గినా.. తిరిగి వచ్చేసినా వారిని ఉరితీస్తోందని వైట్ హౌస్ షాకింగ్ ఆరోపణలు చేసింది. అమెరికా జాతీయ భద్రతా అధికారుల సమాచారం రష్యా మిలిటరీలో అంతర్గత సమస్యలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే మిలిటరీలో నాయకత్వం లోపించిందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు రష్యా ఎంత మంది సైనికులను ఉరి తీసింది అనే విషయం బయటికి రాలేదు. యువ సైనికులు, ట్రైనింగ్ సరిగ్గా లేని వారినే ఉక్రెయిన్ సైన్యంతో పోరాడమని రష్యా బలవంతం చేస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక సాయం అందించాలని రిపబ్లికన్లను ఆదేశించారు. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (zelensky) స్పందిస్తూ.. ఉక్రెయిన్ సైన్యం వల్ల రష్యా సైనికులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ సైన్యం చేతిలో రష్యాకు చెందిన ఒక బ్రిగేడ్ సైనికులు అంతమయ్యారని వెల్లడించారు. ఒక బ్రిగేడ్ అంటే 2000 నుంచి 5000 సైనికులు. (russia ukraine war)