Free Bus Scheme: కండక్టర్ చేతివాటం.. ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతూ దొరికిపోయారు
Free Bus Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నేపథ్యంలో కొందరు TSRTC కండక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్నారు. మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న TS34TA5189 బస్సులో గండీడ్ అనే కండక్టర్.. జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగం అంతా ఫోన్లో చిత్రీకరించాడు. ఇలా కండక్టర్లు మోసాలకు పాల్పడుతుంటే ఇక ఈ పథకం కొనసాగించడంలో అర్థంలేదని ప్రయాణికులు కూడా వాపోతున్నారు.
అవసరం లేకపోయినా ఎక్కుతున్న ప్రయాణికులు
కొందరు మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళ మెహబూబ్ నగర్ వెళ్తున్న బస్సు ఎక్కి దాదాపు గంట పాటు ప్రయాణించింది. ఆ తర్వాత బస్సు ఆగిన చోట దిగి ముఖం కడుక్కుని ముఖానికి క్రీం రాసుకుని మళ్లీ అదే బస్సు ఎక్కిందట. అది గమనించిన కండక్టర్ ఎందుకు మళ్లీ ఎక్కారు అని అడిగితే.. తప్పేముంది ఉచితమేగా ఏదో టైం పాస్‌కి అని చెప్పిందట. ఉచితంగా ఇస్తే ఇలాగే ఉంటుంది మరీ..!