Rajasthan Royalsకి RRR టీం అదిరిపోయే పంచ్!

Hyderabad: రాజ‌స్థాన్ రాయ‌ల్స్(rajasthan royals) టీంకి..RRR టీం అదిరిపోయే పంచ్ ఇచ్చింది. ఈ మ‌ధ్య‌కాలంలో స్టిక్క‌ర్లు, మీమ్స్‌తో చాటింగ్ చేసుకుంటున్న రోజులివి. అయితే నిన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కి.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కి(sunrisers hyderabad) జ‌రిగిన మ్యాచ్‌లో ఓ మిరాకిల్ జ‌రిగింది. లాస్ట్ బాల్‌కి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలిచింది అని సంబ‌ర‌ప‌డిపోతుంటే.. అది నో బాల్ కావ‌డంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం విన్న‌ర్‌గా నిలిచింది. దాంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీంకి ఒళ్లుమండిపోయింది. కంట్రోల్ చేసుకోలేక‌.. “RRR కంటే.. SSS గొప్ప‌ది” అని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్వీట్ చేసింది. ఇక్క‌డ SSS అంటే స్కిప్ప‌ర్ సంజూ సామ్‌స‌న్ అని అర్థం. దాంతో ఈ ట్వీట్ కాస్తా RRR టీం కంట‌ప‌డింది. మ‌రి మ‌న‌వాళ్లు ఊరుకుంటారా? వెంట‌నే ఓ మీమ్‌తో గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. వెంకీ సినిమాలో బ్ర‌హ్మానందం.. ర‌వితేజ‌తో “ఏడ్సావ్‌లేరా” అనే డైలాగ్ ఉన్న మీమ్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నోరుమూయించారు. దాంతో ఈ మీమ్ కాస్తా వైర‌ల్‌గా మారింది. ట్రోల‌ర్స్ ఎక్క‌డ కామెంట్ల‌తో ఏసుకుంటారో అని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్విట‌ర్ టీం భ‌య‌ప‌డిన‌ట్లుంది. వెంట‌నే RRR టీంకు సారీ చెప్పింది. “ఈ సినిమా ప్ర‌పంచానికి చేరుకుంది. మా క్ష‌మాప‌ణ‌లు కూడా చేరుకోవాలి. RRR & SSS రెండూ ఇష్ట‌మే” అని ట్వీట్ చేసింది.