Rohit Sharma: ద్ర‌విడ్ కోస‌మే క‌ప్ గెల‌వాల‌నుంది

Rohit sharma: మొత్తానికి టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ (world cup) ఫైన‌ల్స్‌కి వ‌చ్చేసింది. రేపు అహ్మ‌దాబాద్‌లో చివ‌రి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో (ind vs aus) త‌ల‌ప‌డ‌నంది. కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. కోచ్ రాహుల్ ద్ర‌విడ్ (rahul dravid) కోస‌మైనా వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని ఉంద‌ని అన్నారు. ఆట‌గాళ్ల‌కు ద్రావిడ్ మంచి క్లారిటీ ఇచ్చార‌ని త‌మ‌కు లిమిట్స్ పెట్ట‌కుండా న‌చ్చిన‌ట్లుగా ఆడ‌మ‌ని ద్రవిడ్ తమ‌తో ఎప్పుడూ చెప్తుంటార‌ని తెలిపారు. కేఎల్ రాహుల్ ఆట తీరును త‌న ఆట తీరును గ‌మ‌నిస్తే ద్ర‌విడ్ త‌మ‌కు ఎంత స్వేచ్ఛ‌ను ఇచ్చారో తెలుస్తుంద‌ని పేర్కొన్నారు.