Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్రలో (maharashtra) ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది మృత్యువాతపడ్డారు. ఔరంగాబాద్‌లోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే వద్ద మిని బస్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. దాంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. నాసిక్ నుంచి బాబా తీర్థ ప్రదేశానికి మిని బస్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.