Renuka Swamy Murder: బిడ్డ ఫోటోలు చూసి కన్నీళ్లతో చేతులు కడుక్కున్నాం
Renuka Swamy Murder: కన్నడ నటుడు దర్శన్‌కు అభిమాని, హత్యకు గురైన రేణుకా స్వామి తల్లిదండ్రులు లీకైన తమ బిడ్డ ఫోటోలను చూసి కుమిలిపోయారు. ఆ ఫోటోలు చూడగానే తమ కళ్ల వెంట వచ్చిన నీటితో చేతులు కడుక్కున్నాం అని చెప్తున్నారు. తప్పు జరిగిపోయింది క్షమించి వదిలేయండి అని ఎంత వేడుకున్నా వారి మనసు కరగలేదా అని రేణుకా స్వామి తండ్రి కాశీనాథ్ వాపోయారు. తమ బిడ్డ భరించిన నొప్పిని నరకాన్ని దర్శన్, పవిత్రలు కూడా అనుభవించాలని.. న్యాయస్థానం వారికి కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఆ ఫోటోలు చూసే ధైర్యం తమకు లేదని.. ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.