మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రేణుకా స్వామి భార్య‌

renu swamy wife gave birth to a baby boy

Renuka Swamy: కన్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ చేతులో దారుణంగా హ‌త్య‌కు గురైన రేణుకా స్వామి భార్య స‌హ‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ హాస్పిట‌ల్‌లో ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు రేణుకా స్వామి తండ్రి మీడియా ద్వారా వెల్ల‌డించారు. మ‌ళ్లీ త‌మ బిడ్డ మ‌న‌వ‌డి రూపంలో జ‌న్మించాడంటూ ఆయ‌న క‌న్నీరుపెట్టుకున్నారు. రేణుకా స్వామి హత్య జ‌రిగిన స‌మ‌యంలో స‌హ‌న ఐదు నెల‌ల గ‌ర్భిణి. త‌న కోడ‌లికి వైద్యులు ఉచితంగా వైద్యం చేసి డెలివ‌రీ చేసార‌ని.. వైద్యుల‌కు తాను రుణ ప‌డి ఉంటాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌ల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌ల ద‌ర్శ‌న్‌తో పాటు ఈ కేసులో ఏ1గా ఉన్న న‌టి ప‌విత్రా గౌడ‌ల బెయిల్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. కోర్టు అందుకు నిరాక‌రించింది. అందుకు రేణుకా స్వామి న్యాయ‌స్థానానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌గా వారిద్ద‌రికీ క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తే త‌న బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుంద‌ని అన్నారు.