Manipur: 20 ఏళ్ల త‌ర్వాత ఆడ‌బోతున్న సినిమా

ఘ‌ర్ష‌ణ‌ల‌తో అల్లాడిపోతున్న మ‌ణిపూర్‌లో (manipur) ఈరోజు హిందీ సినిమాను ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించింది హ‌మ‌ర్ స్టూడెంట్స్ అసోసియేష‌న్ (hsa). ఇదొక గిరిజ‌న విద్యార్థుల సంస్థ‌. ఈరోజు స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) కావ‌డంతో రెంగ్‌కాయ్ (rengkai) అనే హిందీ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ రాష్ట్రంలో ఒక హిందీ సినిమా ఆడి 20 ఏళ్లు అవుతోంది. చివ‌రిగా ఇక్క‌డ ఆడిన హిందీ సినిమా కుచ్ కుచ్ హోతా హై (kuch kuch hota hain). కొన్ని ఉగ్ర‌వాద సంస్థ‌లు గిరిజ‌నుల‌ను ద‌శాబ్దాల పాటు అణ‌చివేసి ఉంచ‌డంతో ఎలా పోరాడామో చాటి చెప్పేందుకే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

2000 సెప్టెంబ‌ర్‌లో రెవ‌ల్యూష‌న‌రీ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ ఇక్క‌డ హిందీ సినిమాలు ఆడ‌నివ్వ‌కుండా బ్యాన్ చేసింద‌ట‌. ఆ త‌ర్వాత దాదాపు 8000 హిందీ సీడీలు, క్యాసెట్ల‌ను కాల్చేసింది. ఎందుకు హిందీ సినిమాలు బ్యాన్ చేస్తున్నారో కూడా తెలీకుండాపోయింది. బాలీవుడ్ సినిమాల ద్వారా మ‌ణిపూర్‌లో సంప్ర‌దాయాలు, విలువ‌లు మంట‌క‌లిసిపోతాన్న కార‌ణంతోనే వారు ఇలా చేసార‌ని స్థానికులు అనుకునేవారు. (manipur)