Reliance Jio: జియో నుంచి స‌ర్‌ప్రైజ్‌.. అతి త‌క్కువ ధ‌ర‌కే మొబైల్

Reliance Jio diwali surprise to jio users

Reliance Jio: రిల‌య‌న్స్ జియో నుంచి దీపావ‌ళి స‌ర్‌ప్రైజ్ రాబోతోంది. అతి త‌క్కువ ధ‌ర‌కే మొబైల్ ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. జియో ఫోన్ ప్రైమా 2 పేరుతో ఈ ఫోన్ రాబోతోంది. స‌రికొత్త డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాట‌రీతో డిజైన్ చేయ‌నున్నారు.  ఈ ఫోన్ ధ‌ర కేవ‌లం రూ.2799. కాక‌పోతే కేవ‌లం జియో సిమ్ ఉంటేనే ఈ ఫోన్ ప‌నిచేస్తుంది.

ప్ర‌త్యేక ప్లాన్స్

రూ.91 రీచార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజూ 100MB డేటా ఉచితం. ఇది 28 రోజులు వ‌స్తుంది

రూ.152 రీచార్జ్ చేసుకుంటే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాక‌పోతే 500MB డేటా రోజూ ఉచితం

రూ.895 ప్లాన్ వేయించుకుంటే ప్ర‌తి నెలా 2GB డేటా ఉచితం

ఫోన్ ఫీచ‌ర్లు

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే వ‌స్తుంది. దీని రిజ‌ల్యూష‌న్ 320 x 240 వ‌ర‌కు ఉంటుంది.

వీడియో కాలింగ్ ఆప్ష‌న్‌తో పాటు 0.3MP కెమెరా క్వాలిటీ ఉంటుంది.

స్టోరేజ్

512MB RAMతో పాటు 4GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వ‌స్తుంది

మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 128GB వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

Kai 2.5.3 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్ అసిస్టెంట్, జియో టీవీ, జియో సావ‌న్, జియో సినిమా ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి.

4G వ‌స్తుంది. బ్లూటూత్‌తో పాటు USB క‌నెక్టివిటీ ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి.