RCB vs GT: “గిల్‌..నువ్వు క‌నిపిస్తే చంపేస్తాం”

Hyderabad: ఆర్‌సీబీ(royal challengers banglore) ఫ్యాన్స్.. శుభ్‌మ‌న్ గిల్‌పై(shubhman gill) బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. నిన్న జ‌రిగిన ఆర్సీబీ వ‌ర్సెస్ జీటీ (rcb vs gt)మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్ విశ్వ‌రూపం చూపించి టీంను గెలిపించాడు. దాంతో ఆర్సీబీ(rcb) ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌లేక‌పోయింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat kohli) సెంచ‌రీ బాదినా ఫ‌లితం లేకుండాపోయింది. దాంతో ఈ సీజ‌న్‌లో అయినా ఆర్సీబీ(rcb) క‌ప్ కొడుతుంద‌ని ఆశ‌తో ఉన్న ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశే మిగిలింది. శుభ్‌మ‌న్ సెంచ‌రీ బాది గుజ‌రాత్ టైటాన్స్‌ను(gujarat titans) గెలిపించ‌డం వ‌ల్లే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌లేక‌పోయిందంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణ‌మైన కామెంట్స్ పెడుతున్నారు. అటు శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు అత‌ని సోద‌రి షెహ్నీల్ గిల్‌ని(shahneel gill) కూడా ఇన్‌స్టాలో నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నారు. “శుభ్‌మ‌న్.. నువ్వు క‌నిపిస్తే చంపేస్తాం. ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోతే మీ సొమ్మేమ‌న్నా పోతుందా” అంటూ మితిమీరిన కామెంట్స్ చేస్తున్నారు.

న‌వీన్ ఉల్ హ‌క్ వెక్కిరింపు

ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్ల‌లేక‌పోవ‌డంతో.. ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్(lsg) క్రికెట‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్(naveen ul haq) త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్న పోస్ట్‌ను పెట్టి ఇన్‌డైరెక్ట్‌గా కోహ్లీని వెక్కిరిస్తున్న‌ట్లు న‌వీన్ స్టోరీ పెట్టాడు. దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మ‌రింత ఒళ్లుమండిపోయింది. కొన్నిరోజుల క్రితం ఆర్సీబీ, ఎల్ఎస్‌జీ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన‌ప్పుడు.. ఆర్సీబీ ఓడిపోయిన‌ప్పుడు ఎల్ఎస్‌జీ మెంటార్ గౌత‌మ్ గంభీర్(gautam gambhir) నోరు మూస్కోండి అని సైగ చేయ‌డం… ఆ త‌ర్వాత గంభీర్‌కు పంచ్‌గా కోహ్లీ కూడా అలాగే సైగ‌లు చేయ‌డంతో రెండు టీం మ‌ధ్య వివాదం చోటుచేసుకుంది. ఇప్పుడు దానిని మ‌న‌సులో పెట్టుకుని న‌వీన్ ఉల్ హ‌క్(naveen ul haq) ఇలా ఆర్సీబీని వెక్కిరిస్తున్నాడు.