UPI Payments: వేరొకరికి పేమెంట్ వెళ్లిపోయిందా? RBI కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయ్?
UPI Payments: UPI ద్వారా చేసే పేమెంట్స్ వల్ల కొన్ని సార్లు నష్టం కూడా ఉంది. ఉన్నట్టుండి ప్రాసెసింగ్‌లో పడటం, పొరపాటున వేరొకరికి పేమెంట్ వెళ్లిపోవడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ సమస్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని UPI రూల్స్ సెట్ చేసింది. అవేంటంటే..
మీరు పొరపాటున తప్పుడు UPIకి డబ్బు పంపితే 24 నుంచి 48 గంటల్లో తిరిగి వచ్చేలా రూల్ పెట్టారు.
అయితే.. డబ్బు పంపిన వ్యక్తి ఖాతా.. రిసీవర్ ఖాతా ఒకే బ్యాంకుకు చెందినట్లైతే రీఫండ్ మరింత వేగంగా అవుతుంది.
ఒకవేళ మీరు పొరపాటున డబ్బు ఎవరికైతే పంపించారో వారు మీకు తిరిగి ఆ డబ్బు పంపించేందుకు ఒప్పుకోకపోతే వెంటనే UPI కస్టమర్ కేర్‌లోకి వెళ్లి ట్రాన్‌సాక్షన్ వివరాలు నమోదు చేయండి. వారే చూసుకుంటారు.
ఒకవేళ కస్టమర్ ప్రాసెస్‌తోనూ మీ సమస్య తీరకపోతే NPCI వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయచ్చు.
డబ్బు పొరపాటున మరో వ్యక్తికి వెళ్లిపోయాయన్న సంగతి మీ బ్యాంక్‌కు కూడా చెప్పండి. దాంతో మీ డబ్బు మీకు వచ్చేలా చేసేందుకు వారు చార్జ్ బ్యాక్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు.
ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసినా ఉపయోగం ఉంటుంది. 1800-120-1740