Ratan Tata Health: విష‌మంగా ర‌త‌న్ టాటా ఆరోగ్యం

ratan tata in critical condition

Ratan Tata Health: ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో వెంటిలేట‌ర్‌పై పెట్టి చికిత్స అందిస్తున్నారు. నిన్న ర‌త‌న్ టాటాను హాస్పిట‌ల్‌లో చేర్పించారని వార్త‌లు వ‌చ్చిన వెంట‌నే రెగ్యుల‌ర్ చెకప్స్ నిమిత్తం తీసుకెళ్లామ‌ని ఆయ‌న కంపెనీ అధికారులు వెల్ల‌డించారు. తీరా చూస్తే ఆయ‌న అనారోగ్య ప‌రిస్థితి విషమంగా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం కానీ ప్ర‌క‌ట‌న కానీ రాలేదు.