Ratan Tata: పెంపుడు కుక్క కోసం లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని..
Ratan Tata: రతన్ టాటా అనగానే.. ఆయనకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమ గుర్తొస్తుంది. ముఖ్యంగా కుక్కలు. రతన్‌కు కుక్కలంటే ప్రాణం. రతన్ వద్ద చాలా పెంపుడు కుక్కలు ఉన్నాయి. కానీ ఆయనకు గోవా (టాటా పెంచుతున్న కుక్కల్లో ఒక కుక్క పేరు) అంటే ఎంతో ఇష్టం. ఆయన పని నిమిత్తం ఓసారి గోవాకి వెళ్తే.. తన స్నేహితుడి కారు దగ్గరికి ఓ ఊర కుక్క వచ్చిందట. దానిని అక్కడే వదిలేయడానికి టాటా మనసొప్పలేదు. దాంతో దానిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నారు. అది గోవాలో దొరికింది కాబట్టి దానికి గోవా అని పేరు పెట్టారు.
అయితే.. ఓరోజు టాటా అవార్డు తీసుకోవడానికి లండన్ వెళ్లాల్సి ఉంది. అప్పుడే గోవాకు అనారోగ్యం చేసింది. దానిని వదిలి వెళ్లలేక టాటా లండన్ పర్యటననే క్యాన్సిల్ చేసుకున్నారు. గోవాతో పాటే ఉన్నారు. అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు. వీధి కుక్కలకు కూడా ఓ ఆసరా ఉండాలని వాటికి కూడా ఈ సమాజంలో బతికే హక్కు ఉందని భావించి కుక్కల కోసమే రూ.800 కోట్ల వరకు ఆయన పెట్టుబడులు పెట్టి సంస్థలను ఏర్పాటుచేసారు. తాజ్ లాంటి పెద్ద హోటల్ ఎదురుగా ఓ వీధి కుక్క కోసం కట్టించిన చిన్న ఇల్లు దానికి మెడకు ఓ బెల్టు వేయడం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. తాజ్ హోటల్ వద్దకు ఏ కుక్క వచ్చినా దానిని కొట్టకుండా అన్నం పెట్టి బాగా చూసుకోవాలని అక్కడి వర్కర్లకు టాటా ఆదేశాలు జారీ చేసారు.