Jaipur: దీపికను బెదిరించిన కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ దారుణ హత్య
Jaipur: రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామెడి (sukhdev singh gogamedi) దారుణ హత్యకు గురయ్యారు. జైపూర్‌లోని ఆయన నివాసంలోకి కొందరు దుండగులు చొరబడి తుపాకీలతో కాల్చి పరారయ్యారు. సుఖ్‌దేవ్‌ను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆయన చనిపోయారు. సుఖ్‌దవ్ సహాయకులకు బుల్లెట్ గాయాలయ్యాయి.
దీపిక పదుకొణె (deepika padukone) నటించిన పద్మావత్ (padmavat) సినిమా రిలీజ్ సమయంలో తీవ్ర నిరసనలకు దిగిన వ్యక్తి ఇతనే. కర్ణిసేనను అవమానించేలా పద్మావత్ ట్రైలర్ ఉందని ఈ సినిమాను రిలీజ్ చేస్తే దీపిక తల నరుకుతామని ఆయన బెదిరించారు. 2015లో కర్ణిసేన నుంచి విడిపోయి సొంతంగా ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దాంతో ఒకప్పటి కర్ణిసేన అధ్యక్షుడు అయిన లోకేంద్ర సింగ్ కాల్వితో విభేదాలు ఏర్పడ్డాయి. అతనేమన్నా సుఖ్‌దేవ్‌ను హత్య చేసాడా అన్న కోణంలో జైపూర్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.