Rashmika Mandanna: డీప్‌ఫేక్ కేసు.. పోలీసులకు సహకరించని మెటా
Rashmika Mandanna: ఇటీవల రష్మిక మందనకు సంబంధించి ఓ డీప్ ఫేక్ (deepfake) వీడియో ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. జారా పటేల్ (zara patel) అనే ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోకి రష్మిక ఫోటోను యాడ్ చేసి అసభ్యకరంగా డీప్ ఫేక్ వీడియోని సృష్టించారు. ఇది కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు. బిహార్‌కి చెందిన ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసారు కానీ అతను కాదని తెలిసి వదిలేసారు.
ఈ నేపథ్యంలో ఆ వీడియో ఏ URL నుంచి వచ్చిందో వివరాలు పంపాల్సిందిగా ఢిల్లీ పోలీసులు మెటాకు లెటర్ రాసారు. అయితే ఇప్పటివరకు మెటా ఈ విషయంలో అసలు స్పందించలేదట. ఆ URL తెలిస్తే నిందితుడిని పట్టుకోవచ్చని కానీ మెటా తమకు సహకరించడంలేదని పోలీసులు అంటున్నారు. మెటా పోలీసులకు కూడా సహకారం అందించడం లేదంటే ఇక సామాన్య నెటిజన్ల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ.. వారు మెటాని హెచ్చరించినప్పటికీ మెటా సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందంటే ఆ సంస్థ నెటిజన్ల ప్రైవసీని ఎంత బాగా రక్షిస్తోందో తెలుస్తోంది.