Rashmika ఫేక్ క్లీవేజ్ వీడియో.. మండిప‌డిన‌ కేంద్ర‌మంత్రి

Rashmika Mandanna: న‌టి ర‌ష్మిక మంద‌న‌కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ క్లీవేజ్ వీడియో ట్విట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది. జారా ప‌టేల్ అనే యువ‌తి వీడియోకి ర‌ష్మిక ఫేస్‌తో ఎడిట్ చేసి రియ‌ల్ వీడియోగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అభిషేక్ అనే ఓ నెటిజ‌న్ గ‌మ‌నించి ఇది ఫేక్ వీడియో అని వెంట‌నే యాక్ష‌న్ తీసుకోవాల‌ని కోరారు. ఇది కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ (rajeev chandrasekhar) దృష్టికి రావ‌డంతో ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌ధాన మంత్రి ప్ర‌భుత్వం ఇలాంటి డిజిట‌ల్ రూల్స్ ఉల్లంఘించేవారి ప‌ట్ల కఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు.

ఏదైనా ఫేక్ వీడియో కానీ పోస్ట్ కానీ ఓ సామాన్య నెటిజ‌న్ కానీ ప్ర‌భుత్వ అధికారి కానీ రిపోర్ట్ చేస్తే దానిని 36 గంట‌ల్లో తొల‌గించాల్సిన బాధ్య‌త డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌దేన‌ని తెలిపారు. ఈ రూల్ పాటించ‌క‌పోతే ఆ ప్లాట్‌ఫాంపై కేసు పెట్టి కోర్టుకు లాగాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయ‌ని.. వీటిపై వెంట‌నే నిఘా ఉంచి తొల‌గించాల్సిన బాధ్య‌త డిజిట‌ల్ ప్లాట్‌ఫాందేన‌ని పేర్కొన్నారు.