Rajasthan High Court: బాలిక లోదుస్తులు తొలిగించి.. ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అత్యాచార యత్నం కాదు

Rajasthan High Court sensational judgement after 33 years

Rajasthan High Court: రాజ‌స్థాన్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. దాదాపు 33 ఏళ్ల క్రితం జ‌రిగిన నేరానికి సంబంధించి సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత ఈరోజు తీర్పు వెల్ల‌డించింది. ఆ తీర్పుపై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అసలేం జ‌రిగింది?

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఉన్న‌ తోడరైసింగ్ అనే ఊరిలో 1991లో జరిగింది ఈ ఘ‌ట‌న‌. ఓ ఆరేళ్ల‌ బాలిక రాత్రి 8 గంటలకు నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఆ బాలికను సువాలాల్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకు వెళ్లి బాలిక లోదుస్తులు తొలిగించాడు. ఆ త‌ర్వాత‌ సువాలాల్ కూడా బట్టలు విప్పి నగ్నంగా ఆ బాలిక ముందు నిల‌బ‌డ్డాడు.

ఆ సమయంలో బాలిక కేకలు పెడుతూ ఏడ్వడంతో స్థానికులు వచ్చి రక్షించి నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఈ కేసుపై 33 ఏళ్ల తర్వాత తీర్పు వెల్ల‌డిస్తూ.. రాజస్థాన్ హైకోర్టు బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఉండటం.. అత్యాచార యత్నం కాదని వెల్ల‌డించింది. ఈ మాత్రం దానికి 33 ఏళ్లు విచార‌ణ జ‌రిపారా అంటూ బాలిక కుటుంబీకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 1991లో కాలం వేరుగా ఉండేద‌ని.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింద‌ని.. ఈ స‌మ‌యంలో ఇలాంటి తీర్పు ఇస్తే ఇలాంటి మ‌రిన్ని కేసులు బ‌య‌టికి వ‌స్తాయ‌ని మండిప‌డుతున్నారు.