Rahul Dravid: ఆ మాటంటే నేను ఒప్పుకోను

Rahul Dravid: నిన్న ఇండియా ఆస్ట్రేలియా (ind vs aus) మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ పోరులో చివ‌రికి ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే ఆస్ట్రేలియా ఆట‌తీరు చూసాక మ‌న ఆట‌గాళ్ల‌కు భ‌యం వేసిందా అని మీడియా వ‌ర్గాలు అడిగిన ప్ర‌శ్న‌కు కోచ్ రాహుల్ ద్రావిడ్ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. మన‌వాళ్లు ఎంతో ధైర్యంతో చివ‌రి వ‌ర‌కు పోరాడార‌ని వారు భ‌య‌ప‌డ్డారు అంటే అస్స‌లు ఒప్పుకోన‌ని తెలిపారు.

“” మ‌న ఆట‌గాళ్లు భ‌య‌ప‌డ్డారు అని అంటే నేను ఒప్పుకోను. మ‌న‌వాళ్లు తొలి ప‌ది ఓవ‌ర్ల‌లో 80 ప‌రుగులు తీసారు. ఆ త‌ర్వాత వికెట్లు కోల్పోయాం. వికెట్లు కోల్పోయిప్పుడు కాస్త ఆట‌తీరు టెక్నిక్స్ మారుస్తాం. మ‌నవాళ్లు కూడా అదే చేసారు. ఇంగ్లాండ్‌తో ఆడుతున్నప్పుడు కూడా వికెట్లు కోల్పోతే టెక్నిక్స్ మార్చి నిల‌దొక్కుకున్నాం. ఆట ముగిసాక నేను డ్రెస్సింగ్ రూంకి వెళ్లి మ‌నవారిని ఓదార్చాల‌నుకున్నాను. కానీ వారు ఎంత బాధ‌లో ఉన్నారంటే అస‌లు ఆ డ్రెస్సింగ్ రూంని నేను అంత బాధ‌తో ఎప్పుడూ చూడ‌లేదు. వారిని ఓదార్చ‌డం నా త‌రం కాలేదు “” అని తెలిపారు.